ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గణితంలో A,B రెండు పేపర్లను కలిపి ఒకే పేపర్‌గా.. అలాగే వృక్ష, జంతు శాస్త్రాలను కలిపి జీవశాస్త్రం పేపర్‌గా.. రెండు లాంగ్వేజెస్‌లో ఇంగ్లీష్ తప్పనిసరిగా చేయనుంది.
కాగా, దీనిపై త్వరలోనే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఇంటర్ సిలబస్, పరీక్షల నిర్వహణాలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయని తొలుత ఊహగానాలు రాగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.