అలర్ట్‌ :ఏపీలో మరో మూడు రోజుల వర్షాలు

-

ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది.

రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. పైన తెలిపిన అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది. వీటి ఫలితంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది.  ఈ మూడు ప్రాంతాల్లో ఏకంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version