ఏపీ – అసోం : మీకు మేము.. మాకు మీరు!

-

ప్రతీదీ కేంద్రంపై భారం వేసేద్దాం… అవసరమైనప్పుడు విమర్శలు చేసేద్దాం… అనే ఆలోచన లేకుండా వీలైనంతవరకూ రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొంటే చిన్న చిన్న సమస్యలు ఇక్కడే పరిష్కరించబడతాయనే సంఘటన తాజాగా ఏపీ – అసోం రాష్ట్రాలమధ్య జరిగింది! ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో మొదలవగా అసోం ముఖ్యమంత్రి సానుకూల స్పందనతో ముగిసింది!

వివరాళ్లోకి వెళ్తే… ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రకాల రైతులతో పాటు ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు! ఈ విషయంలో ఆక్వా కీలక భూమిక పోషిస్తున్న ఏపీలో అధికంగా ఉన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌‌ కు ఫోన్ చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ మొదలుపెట్టిన జగన్… ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని.. అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం కోరారు.

ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన అసోం సీఎం.. ఆక్వా ఉత్పత్తుల దిగుమతి విషయంలో తగు చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎంకు హామీ ఇస్తూనే… లాక్‌ డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని కోరారు. ఈ విజ్ఞప్తికి స్పందించిన జగన్.. ఏపీలో ఉన్న అసోం వాసులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని మాటిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version