వారం రోజులు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఐతే పురుషులకి అత్యవసరం అయ్యేవి ఏమిటో తెలుసుకోండి. 

-

ఇంట్లో కూర్చుండి అలసిపోయి ఎక్కడైకైనా వెళ్దామని అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ బీచ్ వెళ్దామని గోల చేస్తుంటే, ప్రతీసారి బీచ్ కే వేళ్ళాడమెందుకన్న ఆలోచనతో వర్షాకాలం పూట ట్రెక్కింగ్ చేయాలన్న ఆలోచన మీ స్నేహితులతో పంచుకున్నప్పుడు, అది విన్న మీ ఫ్రెండ్స్ ఎగిరి గంతేసి, మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అక్కడకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఏం తీసుకెళ్ళాలన్న ఆలోచన మీకు వచ్చినపుడు కావాల్సిన అత్యవసర విషయాల గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా మగవాళ్ళకి ఏమేం అవసరమో, వాళ్ళ ట్రావెల్ కిట్ లో ఏమి ఉండాలో ఇక్కడ చూద్దాం.

టాయిలెట్ పౌచ్

మీ ట్రావెల్ బ్యాగులో చిన్న చిన్న షాషే షాంపూ ప్యాకెట్లు, కండీషనర్లు, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ లతో పాటు టాయిలెట్ పౌచ్ ఉంచుకోండి. ఇంకా షేవింగ్ బ్లేడ్స్, హెయిర్ ట్రిమ్మర్స్ మరిచిపోకండి. వెళ్ళేది వారం రోజులే అయినా వారం రోజులా పాటు బాగా కనిపిస్తే బాగానే ఉంటుంది కదా!

సరైన వస్త్రాలు

మీరు వెళ్ళే ప్రాంతాన్ని బట్టి మీ బట్టలు ఉండలి. వర్షాకాలం కాబట్టి లేతరంగులున్న వస్త్రాలను ధరించండి. కాటన్, లినెన్ వస్త్రాలి బాగుంటాయి. ట్రెకింగ్ వెళ్తున్నట్లయితే నైలాన్ లేదా పాలిస్టర్ బట్టలు మేలు. షూ తీసుకునేటపుడు స్టైల్ గా ఉండే వాటికంటే మీకు సౌకర్యంగా అనిపించినవే తీసుకోండి.

రెయిన్ కోట్

వర్షాకాలం కాబట్టి మీరు వెళ్ళే ప్రాతంలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ట్రెక్కింగ్ కోసం పశ్చిమ కనుమలకు వెళ్తే వర్షం పడుతూనే ఉంటుంది. అందువల్ల ఒక గొడుగు, రెయిన్ కోట్, షూస్ ఉండాలి. వీటికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ బడ్జెట్ లో ఆన్ లైన్ లో రకరకాల వెరైటీలు లభ్యం అవుతున్నాయి.

బ్యాటరీ ఛార్జర్స్, అడాప్టర్స్

ట్రావెలింగ్ కి వెళ్తున్నప్పుడు ఇవి అత్యంత ఆవశ్యకమైనవి. వీటిని అస్సలు మర్చిపోవద్దు. అంతే కాదు వీటిని తీసుకెళ్ళే ముందు అవి పనిచేస్తున్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి.

సన్ స్క్రీన్

బయటకు వెళ్తున్నారు కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ దగ్గర పెట్టుకోండి. సూర్యకిరణాలు పడే అవకాశం ఎక్కువ కాబట్టి, ఎల్లవేళలా సన్ స్క్రీన్ ఉంచుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version