‘అర్జున ఫల్గుణ” టీజర్ రిలీజ్..పక్కా ఊర మాస్ అంటూ వచ్చేసిన శ్రీవిష్ణు !

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ విష్ణు.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా డిఫెరెంట్‌ కథాంశాలతో అలరిస్తున్న శ్రీ విష్ణు…తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఇటీవల విడుదలైన రాజ రాజ చోర సినిమాతో భారీ హిట్‌ అందుకున్న శ్రీ విష్ణు మరో ప్రాజెక్ట్‌ వస్తున్నాడు. యంగ్‌ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం నటిస్తున్న సినిమా అర్జున ఫల్గుణ.

ఘాజీ, క్షణం, వైల్డ్‌ డాగ్‌ తదితర విజయ వంతమైన సినిమాలను రూపొందించిన మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ కింద ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు తేజా మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా అమృతా అయ్యర్‌ నటిస్తుండగా… ఇతర ప్రధాన పాత్రల్లో నరేశ్‌, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్‌ , జబర్దస్త్‌ మహేశ్‌, రాజ్‌ కుమార్‌ చౌదరి, చైతన్య నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version