నా పర్మిషన్ లేకుండానే డబ్బు నా ఇంట్లో పెట్టారు: అర్పిత

-

బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు మోడల్‌ అర్పితా ముఖర్జీ ఇళ్లలో రూ.50కోట్లకు పైగా నోట్ల కట్టలు, బంగారం బయటపడిన విషయం తెలిసిందే. దీంతో మంత్రితోపాటు అర్పిత అరెస్టవగా.. ఈ డబ్బుతో తమకెలాంటి సంబంధం లేదని ఆ ఇరువురు బుకాయించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని పార్థా ఛటర్జీ చెబుతుండగా.. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అనుమతి లేకుండానే తన ఇళ్లలో ఆ డబ్బు, నగలు పెట్టారని ఈడీ విచారణలో అర్పిత చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని ఛజర్జీ పేర్కొన్నారు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారా అని విలేకర్లు అడగ్గా.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. 2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు.. పార్థాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అర్పిత నివాసాల్లో సోదాలు జరపగా.. రూ.కోట్ల విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, కీలక దస్త్రాలను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version