శ్రీలంక లోని పల్లెకెలే స్టేడియం లో ఆసియా కప్ మ్యాచ్ ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య జరుగుతోంది. ప్రస్తుతం రెండు సార్లు వర్షం బ్రేక్ వలన మ్యాచ్ 48 .5 ఓవర్ ల పాటు జరిగి ఇండియా తన ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ తీసుకుని పూర్తి ఓవర్ ల పాటు ఆడకుండానే 266 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇండియా లో ప్లేయర్లు అందరూ ఫెయిల్ అయిన చోట కీపర్ ఇషాన్ కిసాన్ మరియు హార్దిక్ పాండ్య ఇద్దరూ అయిదవ వికెట్ కు నిలబడి 138 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ ఆదుకుంటే ఇండియా పరిస్థితి చాలా దారుణమ్గా ఉండేది. కీలక ప్లేయర్లు రోహిత్ శర్మ 11, గిల్ 10, విరాట్ కోహ్లీ 4, అయ్యర్ 14, జడేజా 14 లు పూర్తిగా నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో ఇషాన్ 82 మరియు హార్దిక్ పాండ్య 87 లు ఆదుకుని పోరాడగలిగే స్కోర్ ను సాధించి పెట్టారు.
మరి ఈ స్కోర్ ను ఇండియా డిఫెండ్ చేసి పాకిస్తాన్ ను ఓడించగలదా అన్నది తెలియాలంటే ఛేజింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.