కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ మండిపడ్డారు. అస్సాం ని పర్యటించిన రాహుల్ గాంధీ ఈనెల 22న ఒక దేవాలయంలోకి తనకి ప్రవేశం కల్పించలేదని రోడ్డుమీద బైఠాయించాడు. అయితే బిజెపి ప్రభుత్వం పై రాహుల్ పలు విమర్శలు కూడా చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన అస్సాం సీఎం తీవ్ర ఆరోపణలు రాహుల్ మీద చేశారు. దేశమంతా కూడా అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రజల దృష్టిని అయోధ్య నుండి మళ్లించడానికి ట్రై చేస్తున్నారని అన్నారు.
అక్కడ ఎవరు అతని ని అడ్డుకోలేదని అన్నారు ఆ దేవాలయంలో వేలాది ప్రజలు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నారని అందుకే ఆ టైంలో లోపలికి వెళ్ళనివ్వలేదని అన్నారు. కావాలని రాహుల్ గాంధీ డ్రామాలు చేసి అయోధ్య నుండి ప్రజల దృష్టి తిప్పడానికి చూస్తున్నాడని రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం మండిపడ్డారు