“కల్కి” సినిమాపై అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు

-

ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా “కల్కి”, ఈ మధ్యనే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఇందులో కమల్, అమితాబ్ లాంటి కీలక నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర బృందం నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే నెల నుండి జరగనున్న షూటింగ్ లో కమల్ హాసన్ తన షెడ్యూల్ ను కంప్లీట్ చేయనున్నాడు. ఇప్పటికే లుక్ టెస్ట్ ను పూర్తి చేసుకోగా, ప్రపంచంలోనే బెస్ట్ గ్రాఫిక్స్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఈ విషయాలు అన్నీ కూడా నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ఛేలెంజింగ్ గా తీసుకుని షూట్ చేస్తున్నాడు. కేవలం ఈ సినిమాలోని VFX కోసం ఏకంగా రూ. 230 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news