ప్రభుత్వ నిర్లక్ష్యంతో 64 మంది చనిపోయారు : అచ్చెన్నాయుడు

-

మాండూస్ తుఫాను కారణంగా ఏపీలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు
అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణాతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. వర్షాలకు పంటలు నీట మునగడంతో కన్నీరుమున్నీరు అవుతున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా శాపంగా మారిందన్నారు అచ్చెన్నాయుడు. కళ్లాల్లోకి చేరిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో అది కూడా తడిసి పాడైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు అచ్చెన్నాయుడు. అధికారులను వెంటనే క్షేత్ర స్థాయికి పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. రైతుల సంక్షేమాన్నికేవలం పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని ముఖ్యమంత్రిని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పారు.

వర్షానికి తడిసిన పంటలను కూడా మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. వరదలకు పంట కొట్టుకుపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని అచ్చెన్నాయుడు కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 64 మంది చనిపోయారని, వేలాది ఇళ్లు, వందలాది ఎకరాల్లో పంటలు
నాశనమయ్యాయని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆ బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయాపైస పరిహారం అందలేదని విమర్శించారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతులకు పంట నష్టాన్ని భర్తీ చేయలేదని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. రైతుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దీనిని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version