వికారాబాద్ లో దారుణం.. పెన్షన్ డబ్బులు ఇవ్వాలని నానమ్మని చితకబాదిన మనవడు.. వీడియో వైరల్

-

రోజులు మారుతున్న కొద్దీ మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. అప్పట్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా, ఏదైనా కష్టం వస్తే దానిని తీర్చడానికి అందరూ కలిసి తమ వంతుగా సహాయం చేసేవారు. అప్పటి మనుషులు మనము, మనది అనే భావన ఎక్కువగా ఉండేది. వారి దగ్గర ధనం ఉన్నప్పటికీ.. అది కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు.

అయితే రాను రాను నెలలు, కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో మార్పులు వస్తున్నాయి. తాజాగా పెన్షన్ డబ్బుల కోసం నానమ్మని ఓ మనవడు కాళ్లతో తన్నిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ లో జరిగింది. వయసు మళ్లీందని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాళ్లతో ఎలా తన్నుతున్నాడో చూడండి. మాటలు నేర్పిన ఆ బామ్మనే బండ బూతులు తిడుతూ.. గొడ్డును బాదినట్లు ఎలా బాదుతున్నాడో చూడండి. మనవడి చేతిలో చావు దెబ్బలు తింటున్న ఈ బామ్మ పేరు యశోదమ్మ.

ఈమె మనవడు గోవర్ధన్ ఓ తాగుబోతు. మద్యానికి బానిసై ఇతడు డబ్బుల కోసం యశోదమ్మని ఇలాగే వేధిస్తుంటాడు. ఆరోజు కూడా ఇలాగే మద్యం మధ్యలో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన గత రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంపీ రంజిత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వికారాబాద్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పరారీలో ఉన్న గోవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version