ఏపీలోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారికి కన్నతల్లి చిత్రహింసలు పెట్టింది.విజయవాడలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ మహిళ, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం.
సదరు మహిళకు 3 సంవత్సరాల చిన్న పాప ఉంది. సదరు వ్యక్తితో కలిసి ఆ మహిళ చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి, ఒంటిపై వాతలు పెడుతూ నరకయాతన చూపిస్తున్నట్లు సమాచారం.చిన్నారి దుస్థితిని గమనించిన స్థానికులు తమ సంరక్షణలో ఉంచుకున్నారు. చిన్నారిని హింసిస్తున్న వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె మీద చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.