ఏపీలో ఈ రోజు తెల్లవారుజాము నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది పెన్షన్ దారులుండగా వారికి ఏపీ ప్రభుత్వం రూ.1497.88 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఈ నెల నుంచి కొత్తగా 34,907 మందికి పెన్షన్ మంజూర్ చేసింది. పెన్షన్లను నేరుగా లబ్దిదారుల చేతికే వాలంటీర్లు అందిస్తున్నారు.
అలా ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేందుకు వెళ్ళిన మడకశిర పట్టణం శివాపురం వాలంటీర్ ఈరప్ప మీద దాడి చేసిన దుండగులు ఆయన వద్దనున్న డబ్బు దోచుకు వెళ్లారు. ఈ గురువారం ఉదయం పింఛన్ పంచడానికి వెళ్లిన వాలంటీర్ ఈరప్ప పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కళ్ళల్లో కారం కొట్టి 43వేలరూపాయల నగదును దోచు కెళ్ళారు దుండగులు. ఇక వాలంటీర్ ఈరప్ప మడకశిర అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.