RRRను మెచ్చిన అవతార్ డైరెక్టర్.. జక్కన్న ఆనందానికి హద్దుల్లేవుగా..

-

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాపై హాలీవుడ్ స్టార్ దర్శకుడు, టైటానిక్​, అవతార్​ సృష్టికర్త జేమ్స్​ కామెరూన్​ ప్రశంసలు కురిపించారు. తాను ఈ సినిమాను రెండు సార్లు చూసినట్లు దర్శకుడు రాజమౌళితో చెప్పారు. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా సోషల్​మీడియాలో తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

“ది గ్రేట్ జేమ్స్ కామెరూన్​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించారు. తన భార్య సుజీతో కలిసి రెండో సారి కూడా చూశారు. నాతో మాట్లాడుతూ మీరు ఈ సినిమాను పది నిమిషాల పాటు విశ్లేషించడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్​(జేమ్స్ కామెరూన్​). మీ ఇద్దరికి ధన్యవాదాలు.” అని జక్కన్న పేర్కొన్నారు. ఇక కీరవాణి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. “ది గ్రేట్స్​ జేమ్స్​ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా మ్యూజిక్​పై ఆయన ఫీడ్​బ్యాక్ ఇచ్చారు. ఎంతో ఎక్స్​ట్​మెంట్​గా ఉంది” అని రాజమౌళి ట్వీట్​ చేశారు.

‘ఆస్కార్‌’ ఓటింగ్‌లో భాగంగా లాస్‌ ఏంజెల్స్‌లోని సన్‌సెట్ టవర్స్‌లో తాజాగా యూనివర్సల్‌ పార్టీ నిర్వహించారు. హాలీవుడ్‌కు చెందిన స్టార్‌ సెలబ్రిటీలందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కుటుంబసమేతంగా అమెరికాకు వెళ్లిన జక్కన్న, సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా యూనివర్సల్‌ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో రాజమౌళి.. మొదటిసారిగా హాలీవుడ్ డైరెక్టర్ స్పిల్ బర్గ్‌ను కలిశారు.

ఆయనతో దిగిన పలు ఫొటోలను రాజమౌళి ట్విటర్​ వేదికగా షేర్‌ చేసి.. “నేను దేవుడిని ఇప్పుడే కలిశాను” అంటూ తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. “గాడ్‌ ఆఫ్‌ మూవీస్‌గా అభివర్ణించే స్పిల్‌బర్గ్‌ను కలిసి.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో చెప్పాను. ‘నాటు నాటు’ ఎంతో నచ్చిందని ఆయన చెప్పిన మాటల్ని నేనింకా నమ్మలేకపోతున్నా” అని కీరవాణి రాసుకొచ్చారు. ‘జురాసిక్‌ పార్క్‌’, ‘హుక్‌’, ‘ది టర్మినల్‌’, ‘ది పోస్ట్‌’ వంటి గొప్ప చిత్రాలకు స్పిల్‌బర్గ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version