ప్రపచంలో హాట్ టాపిక్ ఏంటంటే.. కరోనాకు మందు వచ్చేసింది.. అనే విషయం.. ఎన్నో కోట్ల ప్రజలు ఈ వార్త వినడం కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.. ఎట్టకేలకు ఎండిన పైరు మీద మేఘం కరుణించి వర్షం కురిపించినట్లుగా కరోనా రోగుల్లో ఈ తీపి వార్త ఎన్నో ఆశలు పుట్టించింది.. అలాగే కొన్ని డౌట్లను కూడా కొందరిలో రేకెత్తించింది.. అవేమంటే.. మరిన్ని రోజులు వేల మంది కరోనా పాజిటివ్ బాధితులు ఏ డ్రగ్ వాడి డిశ్చార్జ్ అయ్యారబ్బా.. మరి ఈ కొత్త మెడిసిన్ వెంటిలేటర్ పై ఉన్న పేషేంట్ కు పనిచేస్తుందా.. సీరియస్ పేషేంట్ ని బతికిస్తుందా.. ఇప్పటి దాకా గాంధీ ఆస్పత్రి వైద్యులు చేసింది ఉత్త ట్రీట్మెంటేనా.. అబ్బో ఎక్కడికో వెళ్లిపోతున్నారు.. ఆగండాగండి.. జర తొందర పడకండి..
ఇక ఎలాగూ మార్కెట్ లోకి మందు వచ్చింది కదా అని రోడ్లపై విచ్చల విడిగా తిరగేయకండి.. అసలే కరోనా ఉన్నా మనం ఎవరి మాట వినే రకం కాదు.. మరి దీనికి మందు ఉందని నిజంగా నిర్దారణ జరిగితే ఇక ఆపే వారు ఎవరు.. ఇదంతా పక్కన పెడితే మార్కెట్లోకి వచ్చిన కరోనా కొత్తమందుకు.. ఇదివరకు చేస్తున్న ట్రీట్మెంట్‌కు తేడా ఏంటో తెలుసుకుంటే.. ఫాబీఫ్లూ టాబ్లెట్స్ తక్కువ మోస్తారు కరోనా లక్షణాలు ఉన్న పేషంట్స్ కి మాత్రమే పనిచేస్తాయట.. సీరియస్ కేసుల్లో పనిచేయదట.. మీకు తెలియని మరో విషయం ఏంటంటే 90% కరోనాపేషంట్స్ వారం, పదిరోజుల్లోనే ఆస్పత్రిలో ఇచ్చే పారాసిట్మాల్, అజిత్రోమైసిన్, హైడ్రోక్లోరోక్విన్, బీ కాంప్లెక్స్ లాంటి టాబ్లెట్స్ వల్ల పూర్తిగా కోలుకొని ఇళ్లకి వెళ్లారట… ఇంకా వెళుతున్నారట..
ఇకపోతే ఆస్పత్రిలో ఇస్తున్న మెడిసన్ ఖరీదు మొత్తం 14 రోజులకి కలిపి రూ 1000 కూడా అవ్వదు.. ఇలా అని ఈ మందులు మీరు సొంతగా వాడకండి.. ఇక ప్రస్తుతం ఒక్కో ఫాబీ ఫ్లూ టాబ్లెట్ రేటు రూ 103. వారు చెప్పే డోసుల ప్రకారం 14 రోజులకి కలిపి 14 వేల చిల్లర అవుతుంది…. 14 రోజుల తరువాత కంటిన్యూగా మరో 12 రోజులు వేసుకొవాలట.. అంటే మైల్డ్ గా కరోనా లక్షణాలు ఉంటే 20 వేల చిల్లర ఖర్చు అవుతుందన్న మాట.. అందులో కరోనా టెస్టులకు డబ్బులు అదనం..
ఇక ఈ మందుకు పుట్టినిల్లు ఐన జపాన్ లో ఇంకా అనుమతి లభించలేదట. అమెరికా లో కూడా అంగీకరించలేదు. కానీ భారత్ లో మాత్రం అనుమతి వచ్చేసింది పైగా ప్రభుత్వ ప్రకటన నామ మాత్రమైనా లేదు, మీడియా లో మాత్రం సంజీవని దొరికేసింది అన్న స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నారు.. మామూలుగానే జనం కరోనాను లెక్క చేయకుండా తిరిగేస్తున్నారు. మూగేస్తున్నారు. ఇక మందు వచ్చింది అని హడావుడి చేస్తే, ఇక భయమే వుండదేమో.. అని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారట.. మరి జనం కూడా ఇలాంటి వాటి విషయంలో కాస్త ఆలోచిస్తే మంచిదంటున్నారు నెటిజన్స్..