Ayushmann Khurrana: ఆ పాత్ర‌ కోసం 90 శాతం చూపు కోల్పోయాడ‌ట‌! ఇంత‌కీ డేరింగ్ హీరో ఎవ‌రంటే..?

-

Ayushmann Khurrana: ఏదైనా పాత్రల్లో మెప్పించాలంటే.. ఆ పాత్ర‌లో ఒడిదిగిపోవాలి. ఆ పాత్రను జీవం పోయాలంటే.. ఎంత రిస్క్‌ అయినా సరే చేయాలి. స‌రిగా అలాంటి సహాసోపేత‌మైన పాత్ర‌నే బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా కు దొరికింది. ఆయ‌న కూడా ఇలాంటి కథలో నటించాలనే త‌ప‌న ఉంది. అలాంటి స్క్రీప్ట్ ద‌ర్శకుడు శ్రీరామ్‌ రాఘవ. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం… అంధాధున్‌.

ఈ చిత్రంలో ఖురానా.. అంధుడైన పియానిస్ట్‌గా న‌టించి.. మెప్పించారు. చక్కటి అభినయం ప్రదర్శించినందుకు గానూ ఆయుష్మాన్‌కు జాతీయ ఉత్తమనటుడు పురస్కారంతో పాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్ సైతం వరించింది. అయితే.. ఇటీవ‌ల అంధాధున్‌లో ఆయుష్మాన్‌ ఖురానాకు మేకప్‌, ప్రొస్థెటిక్ డిజైనర్‌గా పనిచేసిన ప్రీతీ షీల్‌ సింగ్‌ మరో ఆసక్తికర విషయాలను వెల్ల‌డించారు.

ఈ పాత్ర‌ కోసం ఆయ‌న బ్లైండ్ పియానిస్ట్ ద‌గ్గ‌ర‌ ట్రైనింగ్‌ తీసుకున్న‌ని తెలిపారు. ఖురానా త‌న దిన‌చ‌ర్య‌లో భాగంగా .. ఐ మాస్క్‌ ధరించి.. ప‌నులు చేసేవాడని.. అలా చేయ‌డం వ‌ల్ల బాడీ లాంగ్వేజ్‌ అర్థం చేసుకున్నాడ‌ని తెలిపారు.బ్లైండ్‌ లుక్‌ కోసం లండన్ నుంచి రూ.6లక్షలు విలువైన స్పెష‌ల్ లెన్స్‌ తెప్పించామ‌ని తెలిపారు.వీటని ‘సెక్లెరల్ లెన్స్’ అంటారు.

ఈ లెన్స్ కళ్లు.. కనిపించే భాగాన్ని కవర్ చేస్తాయి. తద్వారా చూపు అంతా మసకబారిపోతుంది. ఈ లెన్స్ వాడితే.. కంటి చూపుకు స‌మ‌స్య వ‌స్తుంద‌ని తెలిసినా కూడా . ఖురానా ఒప్పుకున్నాడ‌ని.. ఈ లెన్స్ ధరించాక ఆయ‌న‌ 80శాతం చూపు కోల్పోవాల్సి వచ్చిందని.. దీనికి తోడు బ్లాక్‌ గ్లాసెస్ పెట్టుకుంటే.. 90శాతం ఆయన చూపు దెబ్బతిన్న‌ద‌ని.. సినిమా మొత్తం అలానే షూట్‌ పూర్తి చేశామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version