ముందస్తు రగడ: బాబు ప్లాన్ రివర్స్?

-

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికల గోల ఎక్కువైపోయింది..అసలు సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే…ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావన ఎక్కువ వస్తుంది. అది కూడా ప్రతిపక్ష పార్టీలే ముందస్తు ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నాయి..ఎప్పటినుంచో తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుంది…ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ముందస్తు ప్రస్తావన తెస్తున్నాయి. అయితే ఇక్కడ ఒకసారి టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కాబట్టి..మరొకసారి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అంటే అక్కడ ముందస్తుకు కాస్త అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఏపీలో కూడా ముందస్తు రగడ ఎక్కువ నడుస్తోంది…ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ…ఈ ముందస్తు ప్రచారం ఎక్కువ చేస్తుంది..వైసీపీ ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని చెబుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే ముందస్తు ప్రస్తావన తెస్తున్నారు..ఇప్పటికే చాలాసార్లు ముందస్తు ఎన్నికల గురించి బాబు మాట్లాడుతూ వచ్చారు..అలాగే అటు అధికార వైసీపీ కూడా ముందస్తు ఎన్నికలు ఉండవని, తమని ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారని, తాము ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడుపుతామని చెబుతుంది.

కానీ చంద్రబాబు మాత్రం..ముందస్తు ప్రచారం ఆపడం లేదు..తాజాగా కూడా ముందస్తు మాట మాట్లాడారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, కాబట్టి ఆ వ్యతిరేకత పూర్తి స్థాయిలో పెరగకముందే జగన్..తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్తారని, కాబట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు.

బాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు..మళ్ళీ యథావిధిగానే ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారని, ఐదేళ్ల పాటు ఉంటామని అంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ముందస్తుకు వెళ్ళే అవకాశాలని కొట్టిపారేయలేం..కాకపోతే వైసీపీ ఈ విషయంలో బయటపడటం లేదు…కానీ ఏదొరకంగా వైసీపీని బయటకు లాగాలని బాబు చూస్తున్నారు..అయితే బాబు ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి ముందస్తు ఎన్నికల రగడ…ఎన్నికలు జరిగే వరకు నడిచేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version