కృష్ణా నేతల దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అవుతుందా…?

-

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీకి రాజధాని ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది. జగన్ వెనక్కు తగ్గే అవకాశం లేకపోవడంతో పాటుగా ఆయన ఎం చేస్తారో అనే ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల్లో నెలకొంది. రాజకీయంగా కూడా జగన్ ని ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ దాదాపుగా చతికిలపడింది అనే విషయం అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు జగన్ చంద్రబాబుకి కృష్ణ జిల్లా టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు.

ఆయన మాట వాళ్ళు వినే పరిస్థితి కనపడటం లేదు. చంద్రబాబుని నమ్మి అప్పట్లో భూములు కొనుగోలు చేసారు. ఎక్కువగా అమరావతి పరిసర గ్రామాలతో పాటుగా నాగార్జునా విశ్వ విద్యాలయం సమీపంలో కూడా భూములు కొనుగోలు చేసారు. ఇప్పుడు రాజధాని మారడంతో భూముల విలువ దాదాపుగా సగానికి సగం పడిపోయింది. దీనితో వాళ్ళు చంద్రబాబు మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీకి రాజీనామా చేయడానికి కొందరు కీలక నేతలు సిద్దంగా ఉన్నట్టు సమాచారం.

మండలి రద్దు కూడా జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇక చంద్రబాబు చేతిలో మార్గం లేకుండా పోయింది. అటు గుంటూరు జిల్లా నేతలు కూడా రాజీనామా చెయ్యలని భావిస్తున్నారు. దీనితో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా దాదాపుగా ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలే కావడం గమనార్హం. రాజకీయంగా చంద్రబాబుకి వాళ్ళు అండగా నిలిచారు కూడా. ఇప్పుడు ఇలా రాజధాని మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో కోట్ల విలువ చేసే భూముల విలువ పడిపోయింది. దీనితో ఒక మాజీ మంత్రి సహా ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version