కొత్త కారు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్..!

-

కొత్త కార్ ని కొనాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్. దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఈ వార్త చూసిన కస్టమర్స్ షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మారుతీ సుజుకీ ఇండియా తాజాగా రెట్లని పెంచేసింది. దీంతో కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వాళ్ళకి షాక్ తగిలింది. కార్ల ధరలను ఏకంగా రూ.34 వేల వరకు పెంచేసింది. జనవరి 18 నుండే కొత్త రేట్లు అమలు లోకి వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం కారణంగా ఎంపిక చేసిన పలు మోడళ్ల ధరలను పెంచామని మారుతీ సుజుకీ ఇండియా రెగ్యులేటరీకి తెలియ జేసింది. మోడల్ ప్రాతిపదికన కార్ల ధర రూ.34 వేల వరకు పెరిగిందని తెలిపింది. ఇలా గత నెల లో చెప్పినట్టు ఇప్పుడు అమలు చేయడం.. పెరిగిన ధరల్ని ప్రకటించడం జరిగింది. అలానే మారుతీ సుజుకీ వాహన అమ్మకాలు డిసెంబర్ నెల లో బాగానే పెరిగాయి.

ఉత్పత్తి వ్యయాలు పెరిగి పోవడం తో కంపెనీ పై తీవ్ర ప్రతికూల ప్రభావం కంపెనీ అంది. సుజుకీ కార్ల అమ్మకాలు వివరాలని చూస్తే.. డిసెంబర్ నెల లో 20 శాతం మేర పైకి కదిలాయి. అలానే అది 160226 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక క్యూ3 మొత్తం చూస్తే కంపెనీ కార్ల అమ్మకాలు 13 శాతం మేర పెరిగాయి. 4,95,897 యూనిట్లుగా నమోదయ్యాయి అని తెలుస్తోంది. s

Read more RELATED
Recommended to you

Exit mobile version