తెలంగాణ గవర్నర్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడాలని బాల్క సుమన్ చురకలు అంటించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరు ? అని నిలదీశారు. ..గతం లో గవర్నర్లు హుందా గా ప్రవర్తించే వారని..క్లౌడ్ బరస్ట్ గురించి గవర్నర్ మాట్లాడటానికి ఆమె ఏమైనా శాస్త్ర వేత్తనా ? అని ప్రశ్నించారు.
గవర్నర్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని చురకలు అంటించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్ లో చేరికలుం టాయని ఈటల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చారు బాల్క సుమన్. 20 మంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటెల అంటున్నారు.. కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గజ్వెల్ లో ఈ సారి పోటీ చే యనని ఎవరికి చెప్పారని నిలదీశారు. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాం… ఈటలకు బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు.