‘మునుగోడు ఉప ఎన్నిక’ రావాలని తెరాస.. వద్దని కాంగ్రెస్‌ : బండి సంజయ్

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గద్దెను అధిష్ఠించేది భాజపాయేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా పాతబస్తీలోనూ పాగా వేస్తామని చెప్పారు. మునుగోడులో ఉపఎన్నిక రావాలని తెరాస కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఉపఎన్నిక రావొద్దని కోరుకుంటున్నారని తెలిపారు.  తెరాసకు 15 సీట్ల కన్నా ఎక్కువ రావన్న అయన.. ఇక కేసీఆర్‌ ఆటలు చెల్లవన్నారు.

ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. సొంతంగా సీట్లు ప్రకటించుకునే సంప్రదాయం భాజపాలో లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు 15 సీట్ల కన్నా ఎక్కువ రావని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాలే తమ బాస్‌లని చెప్పిన బండి సంజయ్‌.. ఎవరైనా కాషాయ జెండా కింద పని చేయాల్సిందేనన్నారు.

ఇన్ని రోజులు ప్రత్యామ్నాయం లేక అందరూ అణిగిమణిగి ఉన్నారని, ఇక కేసీఆర్‌ ఆటలు చెల్లవని వ్యాఖ్యానించారు. అన్ని రకాల మాఫియాల వెనుక తెరాస నేతలే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version