రాజ్ గోపాల్ రెడ్డి మగాడిలా లెక్క తిరుగుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అన్ని కులాలను కెసిఆర్ వదిలేశాడు… కులాల వారిగా ఎవరికి ఏమి చేశావో చెప్పు అని నిలదీశారు. ఈ నియోజక వర్గం లో ఎంతమందికి ఉద్యోగం వచ్చిందో జాబితా విడుదల చెయ్యి… ఎమ్మెల్యే లను జంతువుల లెక్క పట్టుకొచ్చి పట్టుకుపోయాడని ఆగ్రహించారు.
TRS పార్టీ అభ్యర్థి ని ఆ పార్టీ నేతలే ప్రచారానికి వద్దని అంటున్నారు… రాజ్ గోపాల్ రెడ్డి మొగొడి లెక్క తిరుగుతున్నారు.. ఓటు అడుగుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం అశ్వద్ధామ రెడ్డి కొట్లాడాడు… ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు చేశారు.
నేను కాదు మీరు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులకు మీరు పోర్లు దండాలు పెట్టాలి…పాస్ పోర్ట్ ల దొంగ తనం లో ఒకడు, ఏసీబీ ట్రాప్ అయింది ఒకరు ఉన్నారు..బానిస బతుకులు బతికేది ఆ ఉద్యోగ సంఘాలు నేతలు అన్నారు. మీ ముఖాలకు 1st తారీఖు న జీతాలు అడిగారా అని ప్రశ్నించారు. మీకు కోట్ల ఆస్తులు ఉన్నాయి… మరి పొట్టకూటి కోసం పని చేసే ఉద్యోగుల పరిస్థితి ఏందన్నారు.