జేపీ నడ్డా చెప్పారు..కేసీఆర్ జైలుకు పోవటం ఖాయం : బండి సంజయ్

-

ఢిల్లీ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి నీటి వివాదాలు ఉండవద్దని కేంద్రం గెజిట్ విడుదల చేసిందని.. రెండు బోర్డుల చైర్మన్ లు హాజరు అయిన సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారని మండిపడ్డారు. బోర్డు సమావేశాలకు హాజరు కాకుండా తెలంగాణ సీఎం సాధించింది ఏంటో చెప్పాలని.. దేశంలో కేసీఆర్
అంత దుర్మార్గపు సీఎం ఎక్కడా లేరని నిప్పులు చెరిగారు. “జేపీ నడ్డా చెప్పారు.. మా వ్యూహం మాకు ఉంది. జైలు కు పోయేది కేసీఆర్ కు తెలుసు…జైలుకు పంపుతమని కేసీఆర్ కు తెలుసు” అని పేర్కొన్నారు బండి సంజయ్.

ఇవాళ జెపి నడ్డా తో భేటీ అనంతరం బండి సంజయ్ మీడియా తో మాట్లాడారు. బోర్డు సమావేశంకు హాజరు అయితే ఏపీని అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం ఉండేదని.. దేశంలో రోజు వారీ షెడ్యూల్ విడుదల చేయని సీఎం కేసీఆర్ ఒక్కరేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ పని చేస్తారా ? పక్క రాష్ట్రము ప్రయోజనం కోసం కేసీఆర్ పని చేస్తారా ? అని నిలదీశారు. 299 టీఎంసీల నీటిని తెలంగాణకు ఒప్పుకుని కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టారు ? కేసీఆర్ సోయి లేకుండా ఉన్నారా ? అని ప్రశ్నించారు. ఇచ్చిన 299 టీఎంసీల నీటిని కేసీఆర్ వాడుకోవడం లేదని.. ఎపి ప్రతి సంవత్సరం 150 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం లు కుమ్మక్కు అయి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version