మైనర్ బాలిక రేప్ ఘటనపై సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్

-

హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకి బహిరంగ లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.” మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మనువడు, వాక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు, టిఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ హోంమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంపై స్పష్టత ఇచ్చి, అనుమానాలకు తావు లేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెంటనే రాష్ట్ర హోంశాఖ మంత్రిని, పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఈ సంఘటన పైన స్పష్టత ఇప్పించాలని బీజేపీ తెలంగాణ శాఖ తరపున కోరుతున్నాం.” అంటూ లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version