ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతానికి పెంపు

-

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లలో ఇదే గరిష్టమని తెలిపాయి.

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును అధికారికంగా నోటిఫై చేస్తామని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించగా 2021 – 22లో 8.10 శాతం వడ్డీ చెల్లించారు. ఈసారి 2023 – 24లో 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version