తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పథకాల కోసం జనాలు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు.స్టాక్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్కీమ్ లో ఒకసారే డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలి.కనీసం రూ.36 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు కాబట్టి మీరు ఎంత మొత్తంలోనైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇన్వెస్ట్ చేసిన కొంతకాలం తర్వాత పెట్టుబడిదారులు ప్రతి నెలా ఒకే మొత్తంలో డబ్బు అందుకుంటారు. ఈ రిటర్న్స్‌ను మీరు డిపాజిట్ చేసిన అమౌంట్లో కొంత మొత్తం, వడ్డీని కలిపి ఎస్బీఐ చెల్లిస్తుంది.వడ్డీ అనేది మీ ఖాతా అమౌంట్ పై ఉంటుంది.
36, 60, 84 లేదా 120 నెలల కాలపరిమితులతో డిపాజిట్ చేయవచ్చు. లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత, కస్టమర్లు బ్యాంక్ నుంచి ప్రతి నెలా రిటర్న్‌లను పొందుతారు. ఈ పథకం కింద పెట్టుబడిదారులు తమ ఇనిషియల్ డిపాజిట్‌కి ముందుగా నిర్ణయించిన నెలవారీ మొత్తాన్ని అందుకుంటారు. ఇన్వెస్టర్లు నెలలో ఏ తేదీన డిపాజిట్ చేశారో అదే తేదీన ఎస్బీఐ రిటర్న్స్ అందజేయడం ప్రారంభిస్తుంది..ఈ స్కీమ్ ను సమీపంలోని బ్రాంచ్ కు వెళ్ళి తెలుసుకోవచ్చు..
భారత్‌లో నివసించే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు… ఇక్కడ బ్యాంక్ ఖాతా ఉండి, వేరే దేశంలో ఉండే వారికి ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం కుదరదు..