కొత్త కారు కొనేవారికి ఎస్బీఐ అదిరే ఆఫర్లు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన చాలా బెనిఫిట్స్ ని కస్టమర్స్ పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే ఎప్పటికప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్స్ ని కూడ ఇస్తుంది. వీటిని వినియోగించుకుని కస్టమర్స్ చక్కగా డబ్బుల్ని ఆదా చెయ్యచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్బీఐ మరో అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. ఇక దాని కోసం పూర్తి వివరాలని చూస్తే..

SBI
SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా కారు కొనాలని అనుకునే వాళ్లకి గుడ్ న్యూస్ చెప్పింది. మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా…? అయితే మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లు తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ తో చక్కటి లాభాలని పొందొచ్చు. కొత్తగా కారు కొంటే పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకుంటే 0.5 శాతం వడ్డీ రేటు తగ్గుతుంది.

అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంటుంది. అలానే లోన్ కోసం తక్షణ సూత్రప్రాయ ఆమోదం లభిస్తుంది. అంతే కాకుండా ప్రియారిటీ డెలివరీ, ఉచిత యాక్ససిరీస్ వంటి అదనపు బెనిఫిట్స్ ని కూడా ఈ ఆఫర్ ని వినియోగించుకుని పొందొచ్చు. దీని కోసం యోనో యాప్‌ లోకి వెళ్లి నేరుగా లోన్ కోసం అప్లై చేసుకో వచ్చు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. లోన్‌పై వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news