జూలై 1 నుంచి అమలుకానున్న కొత్త రూల్స్ ఇవే..!

-

నిత్యం బ్యాంకులకు సంబంధించి ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి. ఇక నెల 1 వచ్చింది అంటే ప్రతిదీ మారి ఉంటుంది.అలాగే వచ్చే నెల 1 నుంచి కూడా కొత్త మార్పులు వస్తున్నాయి..కొత్త లేబర్ కోడ్ అమలు కానుంది.దాంతో ఉద్యోగుల పని వేళలు, జీతాల లో మార్పులు రావడం సహజం..

న్యూ వేజ్ కోడ్‌తోపాటు నూతన కార్మిక చట్టాలు అమలు చేయడంతో ఉద్యోగి, కార్మికుడు ప్రతి నెలా వేతనం, ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ లో కంట్రిబ్యూషన్ వచ్చేనెల 1వ తేదీ నుంచి మారిపోనున్నాయి. పని గంటల్లో పెరుగుదల, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల వేతనాలు తగ్గుముఖం పడతాయి. ఇంకా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, డాక్టర్లపై టీడీఎస్ నిబంధనలు, ఇతర రూల్స్‌ మారనున్నాయి. టీడీఎస్‌ కొత్త నిబంధన కింద కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది..

ఇప్పటి వరకు 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేజ్ కోడ్‌ల కింద ముసాయిదా నిబంధనలు ప్రచురించాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి రామేశ్వర్ ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. వచ్చే నెలలో కేంద్ర సర్కార్‌ తన ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెరగనుంది. ప్రతి ఏడాది జనవరి, జూలైలో డీఏ పెరుగుతుంది.సైబర్ నేరగాళ్ళ నుంచి సేవ్ చేసెందుకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమలు చేయనున్న టోకేనైజేషన్‌ వ్యవస్థ ముందుగా జూన్‌ 30తో క్లోజ్ అవ్వనుంది. వివిధ పారిశ్రామిక కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై జారీ చేయనున్న టోకెనైజేషన్ అమలును సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news