కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై

-

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి గా… ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేరును… ఖరారు చేసింది బిజెపి పార్టీ అధిష్టానం. ముందుగా అందరూ అనుకున్నట్లు గానే…. బీజేపీ అధిష్టానం బసవరాజు బొమ్మై పేరును ఫైనల్ చేసేసింది. ఈ మేరకు బీజేపీ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా లేక మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అని తర్జనభర్జన పడ్డ బీజేపీ అధిష్ఠానం.. చివరకు బసవరాజ్ బొమ్మై వైపే మొగ్గు చూపింది.

2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే నాయకుడి కోసం అన్వేషించిన బీజేపీ చివరకు బసవరాజు బొమ్మై సీఎం పదవిని కట్టబెట్టింది. లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బసవరాజ్‌… పార్టీలో చాలా క్రమశిక్షణగా ఉన్న నాయకుడు కావడం గమనార్హం. కాగా.. రెండు రోజుల కిందనే కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఎడ్యూరప్ప రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న గవర్నర్ కూడా ఎడ్యూరప్ప రాజీనామా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం.. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై ని నియామకం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version