అబుదాబిలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు..!!!

-

తెలంగాణా సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ సంబరాలు. తెలంగాణా బిడ్డలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే బతుకమ్మ పండుగని ఎంతో వైభవంగా చేసుకుంటారు. సుమారు 9 రోజులు నిర్వహించే ఈ పండుగ ఎంతో శోభాయమానంగా సాగుతుంది. దసరాకి రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత బ్రతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

వివిధ దేశాలలో ఉండే తెలంగాణా వాసులు ఏ పండుగని జరుపుకున్నా, జరుపుకోక పోయినా సరే బతుకమ్మ పండుగని తప్పకుండా జరుపుకుంటారు. తాజాగా బతుకమ్మ పండుగని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న తెలంగాణా వాసులు ఆదేశ రాజధాని అబుదాబిలో ఏర్పాటు చేసుకుని ఘనంగా జరుపుకున్నారు.

 

అబుదాబిలో స్థానికంగా ఉన్న తెలంగాణా వాసుల సంఘం కొన్ని రోజుల ముందునుంచీ అక్కడ ఏర్పాట్లని పరిశీలించి. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ సోషల్  అండ్ సెంటర్ వేదికపై నిర్వహించారు. అయితే ఈ వేడుకలో మరొక విశేషం ఏమిటంటే. అబుదాబిలో పూలు దొరకడం కష్టం కావడంతో ఇండియా నుంచీ రకరకాల పూలని తెప్పించి మరీ వేడుకలని జరుపుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version