గవర్నర్ ప్రసంగంలో కొత్త జిల్లాల మాట… గిరిజనుల కోసం రెండు కొత్త జిల్లాలు

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గణతంత్ర వేడుకల్లో భాగంగా గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ కూడా కొత్త జిల్లాలపై మాట్లాడారు. గవర్నర్ చదివే ప్రసంగం కాపీలో కొత్త జిల్లాల ప్రస్తావన ఉంది. పరిపాలన సౌలభ్యం కొరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని… గిరిజనుల కోసం రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసంగంలో తెలపారు. మానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని… కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు గవర్నర్.

ఇప్పటికే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడుగా కొత్తగా మరో 13 జిల్లాలు మొత్తం 26 జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version