బ్యూటీషియన్ హత్యాయత్నం కేసులో ఊహించని పరిణామం..

-

నిందితుడు నూతన్ రైలు కింద పడి బలవన్మరణం

విజయవాడ సమీపంలోని హనుమాన్ జంక్షన్ లో రెండు రోజుల క్రితం జరిగిన బ్యూటీషియన్ పద్మ పై హత్యాయత్నం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పద్మపై దాడి చేసిన ప్రియుడు నూతన్ పోలీసులకు భయపడి తప్పించుకుని పారిపోయిన సంగతి తెలసిందే.. దీంతో పోలీసులు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం 4 గ్రూపులుగా ఏర్పడి గాలింపు మొదలు పెట్టారు.. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నరసరావు పేట – గుంటూరు రైలు మార్గంలో పట్టాలపై నూతన్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధం వల్ల ఇద్దరి  మధ్య తలెత్తిన గొడవతో .. బాధితురాలిని కట్టేసి నుదిటి పై ఎస్ అనే అక్షరాన్ని చెక్కడంతో పాటు అత్యంత కిరాత కంగా కాళ్లు, చేతులను నరికాడని పోలీసులు నిర్దారించారు.

 

 

 

నూతన్ నుంచి విడిపోయి భర్త వద్దకు వెళ్లిపోతా అనే ఆలోచనను నూతన్ వ్యతిరేకించడం కారణంగా ఇద్దరి మధ్య గొడవ చెలరేగినట్లు పద్మ వివరించింది. తనకు దక్కని పద్మ మరెవ్వరికీ దక్కకూడదనే ఆలోచనతోనే చంపేందుకు ప్రయత్నించాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. పద్మ ఎంత సేపటికి ఫోన్ ఎత్తకపోవడంతో రెండో కూతురు ఇంటికి ఇచ్చి చూసే సరికి పద్మ

రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో స్థానికులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version