కోడి ‘క్యాట్ వాక్’ చెయ్యడం ఎప్పుడైనా చూశారా?

-

కోడి అంటే కోనసీమ లో కోడి పందాలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి..మిగితా ప్రాంతాలలో రుచి కరమైన విందు గుర్తుకు వస్తుంది..అయితే కోడి ఎప్పుడైనా అందాల పోటీలో పాల్గొనడం చూశారా..అదేంటి కోళ్లకు కూడా ఇలాంటి పందాలు ఉంటాయా..అనే సందేహాలు రావడం సహజం..అవును అండీ..మీరు విన్నది అక్షరాల నిజం..కొన్ని దేశాలలో ఈ కోళ్లకు కోడి పందాలను నిర్వహిస్తారట.అందులో క్యాట్ వాక్ జనాలను విపరీతంగా ఆకట్టుకుందట.అసలు ఆ కోడి పుంజు ప్రత్యేకతలు, అది ఎక్కడ నిర్వహిస్తారో ఆలస్యం లేకుండా ఒకసారి చూద్దాం..

మలేషియాలోని సెలంగోర్ రాష్ట్రంలోని కంపూంగ్‌ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఇలా కులుకుతూ హొయలు పోతూ..చక్కగా ఏమాత్రం బెదరకుండా చక్కగా క్యాట్‌ వాక్‌ చేస్తుంటే.. అందరూ చూసి వారెవ్వా ఏమి అందం అనుకుంటూ నోర్లు వెల్లబెడుతున్నారు.సెరమా కోళ్లు తూర్పు ఆసియాకు చెందిన బాంటమ్ జాతి. వీటిని పెంచే యజమానులు వాటిని చక్కగా పెంచి చక్కటి ఆహారం పెట్టి పెంచి ఇలా అందాల పోటీల్లో పెడుతుంటారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన కోళ్లకు భారీగా బహుమతులు కూడా అందజేస్తారు. ఈ జాతి కోళ్లు చాతీ ఉబ్బినట్లుగా ఉండి చక్కటి ఆకర్షణీయమైన ఈకలతో అందంగా కనిపిస్తాయి..వాటిని కేవలం పోటీ కోసమే పెంచుతారట.. నిజంగా ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ…మీరు ఆ కోడి పై ఒకసారి లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version