కేవలం రూ.25 పొదుపుతో ఇలా రూ.5 లక్షల 40 వేలు పొందండి…!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని ప్రజలకి ఇస్తోంది. వీటి వలన ప్రజలకి బాగా బెనిఫిట్ గా ఉంటుంది. అయితే ఈ సేవలని పొందడం వలన పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అలాగే దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఒక్కో పాలసీ ఒక్కోలా ఉంటుంది. అయితే మీరు తీసుకునే పాలసీ ప్రాతిపదికన వచ్చే బెనిఫిట్స్ కూడా ఆధారపడి ఉంటాయి. జీవన్ లాభ్ పాలసీ గురించి, కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.

 

LIC

ఎల్‌ఐసీ అందించే పాలసీలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీలో చేరాలంటే వయస్సు 8 నుంచి 59 ఏళ్ళు ఉండాలి. ఇందులో చేరడం వల్ల పలు బెనిఫిట్స్ పొందొచ్చు. మీ వయస్సు ఈ పాలసీ తీసుకోవడానికి సరిపోతే మీరు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఇది ఇలా ఉంటే కనీసం రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు.

గరిష్ట పరిమితి ఏం లేదు. పాలసీ టర్మ్ 16, 21, 25 ఏళ్లుగా ఉంది. 16 ఏళ్ల టర్మ్ అయితే పదేళ్లు ప్రీమియం కట్టాలి. 21 ఏళ్లు అయితే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అదే 25 ఏళ్లు అయితే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తం పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది.

30 ఏళ్ల వయసులో ఉన్న వారు 25 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.2 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే అప్పుడు నెలకు రూ.777 వరకు ప్రీమియం చెల్లించాల్సి రావొచ్చు. అంటే రోజుకు రూ.25 పొదుపు చెయ్యాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.5.4 లక్షలు లభిస్తాయి. ఇందులో బీమా మొత్తం రూ.2 లక్షలు. బోనస్ కింద రూ.2.5 లక్షలు వస్తాయి. అంతే కాకుండా ఎఫ్ఏబీ కింద మరో రూ.90 వేలు లభిస్తాయి. ఇలా మొత్తంగా రూ.5.4 లక్షలు మీరు ఈ పాలసీ ద్వారా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version