ప్రతీ నెలా డబ్బులు కావాలా..? అయితే ఇదే బెస్ట్ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే..!

-

ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు డబ్బులు సేవ్ చేసుకోవాలని.. స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనీ చూస్తున్నారు. సురక్షిత పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఈ మధ్య అంతా ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా మంచి స్కీమ్ లో డబ్బులని పెట్టాలని చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ వివరాలు చూడాల్సిందే. ఇందులో కనుక డబ్బులు పెడితే ప్రతీ నెలా కొంత పెన్షన్ పొందొచ్చు.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం వివిధ రకాల సర్వీసులని అందిస్తోంది. అయితే స్టేట్ బ్యాంక్ అందిస్తున్న స్కీమ్స్ లో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందొచ్చు. ఈఎంఐ రూపంలో డబ్బులు డిపాజిటర్ల అకౌంట్ల లో ప్రతీ నెలా జమ అవుతూ ఉంటాయి.

కొంత అసలు, కొంత వడ్డీ కలిపి వస్తుంది. ఈ స్కీమ్ లో మీరు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలకి డిపాజిట్ చెయ్యచ్చు. మంత్లీ యాన్యుటీ కింద కనీసం రూ.1,000 వస్తుంది. మీరు పే చేసే దాని బట్టీ డబ్బులు ఇస్తారు. 75 శాతం ఓవర్ డ్రాఫ్ట్ లేదా లోన్ తీసుకోవచ్చు.

6.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీ వస్తోంది. మీరు సెలెక్ట్ చేసే కాలవ్యవధిని బట్టి వడ్డీ మారుతూ ఉంటుంది. మీరు కూడా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలా..? ఎస్‌బీఐ బ్రాంచ్‌ కి వెళ్లి ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. మైనర్లు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version