పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఐదో షోకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

-

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ‘భీమ్లానాయక్’ సినిమాకు థియేటర్లలో ఐదో షోకు అనుమతి ఇస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. భారీ ఓపెనింగ్స్, ఫ్యాన్స్ తాకిడిని దృష్టిలో పెట్టుకుని అదనపు షోకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు భీమ్లా నాయక్ సినిమాకు స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చింది. వకీల్ సాబ్ సక్సెస్ తరువాత వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భీమ్లా నాయక్ విడుదల కానుంది. దీంతో ఇప్పటికే ఆన్ లైన్ లోని టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మళయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రిమేక్ గా భీమ్లా నాయక్ వస్తుంది. 

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ అయింది. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాన్ జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా, పవన్ కళ్యాన్కి ఛాలెంజ్ విసిరే క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సంయుక్త మీనన్, సముద్రఖని, మురళీ శర్మ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version