ఫ్యాక్ట్ చెక్: భింద్రన్వాలె, ఖలిస్థాన్ టీ షర్ట్స్ ని అమెజాన్ భారతదేశంలో అమ్ముతోందా..?

-

తాజాగా ఒక సిక్కు అతను పాకిస్తాన్ ఉగ్రవాది భింద్రన్వాలె, ఖలిస్థాన్ వున్న టీ షర్ట్ ధరించి ఉన్న పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసి కొన్ని సోషల్ మీడియా పోస్టులో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ భింద్రన్వాలె, ఖలిస్థాన్ టీ షర్ట్స్ ని భారతదేశంలో అమ్ముతోంది అని ఆరోపణలు చేశాయి.

అయితే నిజంగా అమెజాన్ ఇటువంటి టీషర్టులని భారత దేశం లో అమ్ముతోందా లేదా..? ఈ విషయంలోకి వస్తే.. అమెజాన్ సోషల్ మీడియా ప్రకారం వచ్చిన వార్త లో నిజం ఎంత అనేది చూస్తే అమెజాన్ అలాంటి టీ షర్ట్లు ఏమీ వెబ్సైట్ ద్వారా అమ్మడం లేదు అని తెలుస్తోంది. ఒకసారి అమెజాన్ లో భింద్రన్వాలె, ఖలిస్థాన్ అని సెర్చ్ చేస్తే కేవలం పుస్తకాలు మాత్రమే వస్తున్నాయి. ఏ టీ షర్ట్లు అమెజాన్ లో ఉన్నట్లు కనబడడం లేదు.

దీంతో భారత దేశంలో అమెజాన్ టీషర్ట్స్ ని అమ్మడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే మరి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అమెజాన్ అమ్ముతున్నట్లు స్క్రీన్ షాట్స్ వచ్చాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేకపోతే ఆ స్క్రీన్ షాట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే… అమెజాన్ భారతదేశంలో మాత్రమే వీటిని అమ్మడం లేదు. అమెజాన్ యుఎస్ వెబ్సైటు మరియు ఇతర దేశాలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం కొన్ని పొడక్ట్స్ మాత్రమే అక్కడ నుండి ఇండియాకి వస్తాయి. అయితే ఇవి కచ్చితంగా రావు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version