బీబీనగర్‌లో ఉన్నటువంటి ఆర్మీ డిఫెన్స్ కాలేజీని గత మూడు నెలల కిందట రాత్రికి రాత్రే ఘట్కేసర్‌లోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలోకి యాజమాన్యం మార్చడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి నుంచి యుపీఎస్ క్లాసులు జరగడం లేదని, పీఈటీ సజెస్ట్ చేసిన మెనూ డైట్ ఇవ్వడం లేదని.. విద్యార్థులను బయటికి రానివ్వకుండా పేరెంట్స్‌ను కలవనీయకుండా మేనెజ్మెంట్ చేస్తున్నదని.. మీడియాను సైతం అనుమతించడం లేదని అటు పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన తెలుపుతున్నారు.
దీంతో నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో విద్యార్థులు, పేరెంట్స్ కొన్ని గంటల పాటు బయట ఎండలో కూర్చుని నిరసన తెలిపారు.అయినప్పటికీ యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదని, చర్యలు తీసుకోలేదని పేరెంట్స్, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ డిఫెన్స్ కాలేజీని తక్షణమే అన్నపట్నంలో చూసిన ప్రదేశానికి మార్చడంతో పాటు యుపీఎస్ ఫ్యాకల్టీని పునః ప్రారంభించాలని, కెప్టెన్ మేడంని మళ్ళీ నియమించి.. డైట్ మెనూ గతంలో మాదిరిగా ఇవ్వాలని విద్యార్థులు నిరసన తెలిపారు.