ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. సోమవారం సాయంత్రం నుంచి కూడా భద్రతను తొలగించే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు భద్రత తొలగించింది. మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు, జెసి దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు లకు భద్రత తొలగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు లకు భద్రతను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
ఇప్పుడు దీనిపై టీడీపీ నేతల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విధంగా వ్యవహరించడం కేవలం కక్ష సాధింపే అవుతుంది అంటూ పలువురు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం ఇదే విధంగా చేసి ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం ఎంత మాత్రం సరైనది కాదు అంటూ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.