లవ్ జిహాదీ పేరుతో హిందూ మతం పై పెద్ద కుట్ర జరుగుతుంది: రాజా సింగ్

-

ఓ ముస్లిం యువకుడు, హిందూ యువతి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై సోమవారం ఒక వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్.. లవ్ జిహాది పేరుతో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 30న మారేడుపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రేమజంట పెళ్లికి సిద్ధమైంది. హిందూ అమ్మాయిని వివాహం చేసుకోవడం పై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటారా?లేదా? అని ప్రశ్నించారు.

హిందూ సమాజం కూడా ఇటీవల ముస్లిం యువకుల చేతిలో హత్యకు గురైన నాగరాజు సంఘటనల స్పందిస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. హిందూ, ముస్లిం వివాహ యోజన నిజమైతే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వివాహాలు మత సామరస్యానికి భంగం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు రాజాసింగ్. లవ్ జిహాద్ పేరుతో హిందూ మతం పై పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. హిందూ తల్లిదండ్రులు తమ కూతుళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version