తెలంగాణ ఎన్నికలు: కేసీఆర్ కు గజ్వెల్ లో గట్టి పోటీ ఉంటుందా ?

-

తెలంగాణ రాజకీయాలలో వచ్చే ఎన్నికలు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయా ? గత రెండు ఎన్నికలుగా ఒకే పార్టీని గెలిపిస్తూ వచ్చిన ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పార్టీలను తెగ వేధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కేసీఆర్ సారథ్యంలోని BRS పార్టీ అధికారంలో ఉన్నది. గత రెండు సార్లు (2014 & 2018 ) కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపును సాధించారు. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా ఇదే నియోజవర్గాన్ని నమ్ముకుని పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి కేసీఆర్ కు సరైన ప్రత్యర్థిని ఎదురుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంపాక్ట్… బీజేపీ మరియు కాంగ్రెస్ లు ఇద్దరూ కూడా కేసీఆర్ ను ఓడించాలని గట్టి నాయకులను ఇక్కడ నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే బీజేపీ నుండి దాదాపుగా గజ్వెల్ బరిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరి కాంగ్రెస్ నుండి ఎవరి పోటీలో ఉంటారన్నదానిపై క్లారిటీ లేదు. మరి ఈటల రాజేందర్ తో కేసీఆర్ కు గట్టి పోటీ ఉండనుంది. ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version