సుప్రీంకోర్టులో టిడిపి నేత అయ్యన్నపాత్రుడుకు చుక్కెదురు అయింది. అయ్యన్న పాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
ఫోర్జరీ సెక్షన్ల ఐపిసి 467 కింద దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో హై కోర్ట్ మద్యంతర ఉత్తర్వులపై ఇవ్వడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బిల్డింగ్ ప్లాను విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో అయ్యన్నపాత్రుడు పై ఆరోపణలు వచ్చాయి. ఇక ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని సుప్రీం, హైకోర్టు సూచనలు చేశాయి.