దుబ్బాకలో రఘునందన్ కు బిగ్ షాక్.. టిఆర్ఎస్ లో చేరిన కీలక నేత

-

దుబ్బాక నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు ఊహించని శాఖ తగిలింది. దుబ్బాక మండల బిజెపి అధ్యక్షుడు అరిగే కృష్ణ బీజేపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో అరిగే కృష్ణ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా హరీష్ రావు కండువా కప్పిమరి అరిగే కృష్ణను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అరిగే కృష్ణ కూడా రఘునందన్ రావు సొంత గ్రామం బొప్పాపూర్ అని సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా అరిగే కృష్ణ బిజెపిలో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనను ఎమ్మెల్యే రఘునందన్ రావు అసలు పట్టించుకోవడంలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు అరిగే కృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version