తెలంగాణా కాంగ్రెస్ కి బిగ్ షాక్, రాజీనామా చేసే యోచనలో రేవంత్…?

-

తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం మొదలైందా…? ఎప్పుడు తగువులతో ఉండే తెలంగాణా కాంగ్రెస్ ఇప్పుడు ఇబ్బంది పడుతూ కూడా పంచాయితీలను వదలడం లేదా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. వాస్తవానికి తెలంగాణా కాంగ్రెస్ ఆ పార్టీ నేతలే ప్రధాన మైనస్ అనే వ్యాఖ్యలు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో సఖ్యత అనేది లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి కాంగ్రెస్ నేతల తగువులు కూడా ఒక కారణం. కెసిఆర్ వద్ద ఇలాంటి పంచాయితీలు లేవని, ప్రశాంతంగా ఉంటుందనే భావన కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా కలిగింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు, ఇది పక్కన పెడితే, ఇప్పుడు పని చేసే నాయకులకు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్డు తగులుతూ ఉంటారు అనే విషయం అర్ధమవుతుంది.

ఇప్పుడు ఈ తగువులు తారా స్థాయికి చేరుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పెత్తనం సహించలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు. దీనితో రేవంత్ కి అడ్డు తగులుతూ వస్తున్నారు. దీనిపై చికాకుగా ఉన్న రేవంత్ ఇప్పుడు పార్టీకి గుడ్ బాయ్ చెప్పే యోచనలో ఉన్నారని సమాచారం. రాజకీయంగా కాంగ్రెస్ కి తెలంగాణాలో భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆయన,

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ముందుకి వెళ్ళడం అనేది సాధ్యం కాదనే భావనలో ఉన్నారట. ఈ తగువులు ఇప్పట్లో పరిష్కారం కావని ఇక్కడే ఉంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బంది పడుతుందని భావిస్తున్న రేవంత్, బిజెపి నేతలతో చర్చలు జరుపుతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాషాయ పార్టీలోకి రేవంత్ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version