రైతులకు బిగ్ షాక్.. తెలంగాణలో ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్ !

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ షాక్ తగిలింది. యాసంగి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక కొనుగోలు కేంద్రాలు… ఉండబోవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక ప్రకటన చేశారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు.. చేయడం లేదని అందుకే యాసంగి లో కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు దృష్టిలో ఉంచుకొని… ఇతర పంటలు వేసుకోవాలని ఆయన తెలిపారు.

 

 

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద తెలంగాణ రాష్ట్ర సిఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి రండ కేంద్ర మంత్రి అని…నీకు దమ్ముంటే మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్రంతో చెప్పించు అని సవాల్ విసిరారు. బీజేపీ రైతు హంతక పార్టీ అని… 700 మంది చనిపోయాక రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని ఫైర్ అయ్యారు. చేతగాని దద్దమ్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని… చేతగాని తనాన్ని రాష్ట్రం మీదకి నెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో పండేదే బాయిల్డ్ రైస్ అని… కేంద్ర మంత్రి దగ్గరికి వెళితే పనిలేదా మీకు అంటున్నారన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version