తిరుమల శ్రీవారి భక్తులకు మరో షాక్ తగిలింది. తిరుమల అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేత కొనసాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది. అంతే కాదు నడక మార్గంలోని మరమ్మత్తు పనులను సెప్టెంబరు మాసం లోపు పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు ఆలయ ఈవో జవహర్ రెడ్డి. గత నెల 1వ తేది నుంచి అలిపిరి నడకమార్గాన్ని మూసివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సెప్టెంబరు మాసం వరకు శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే భక్తులను అనుమతించనుంది టీటీడీ. ఇక అటు కరోనా మహమ్మారి నేపథ్యంలో … తిరుమల శ్రీవారి దర్శనం విషయములో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్ లైన్ ద్వారానే ముందుగానే టిక్కెట్లు ఇస్తోంది.
కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2567 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,988 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 18 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,042 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.