ష్టార్ట్ వీడియోస్‌తో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న అషూ రెడ్డి.. బిగ్ బాస్ తో కూడా చాలా పాపులర్ అయింది. అషూ రెడ్డి బిగ్ బాస్ – 3 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అయితే ఫైనల్ వరకు రాకుండానే.. ఎలిమినేషన్ అయిపోయింది. బిగ్ బాస్ కప్పు కొట్టకపోయినా.. పలు కామెడీ షోలతో పాటు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్య్వతో ఇంకా క్రేజ్ ను సొంతం చేసుకుంది. కాగ తాజా గా అషూ రెడ్డి డిస్పీ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం అయ్యే.. బిగ్ బాస్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ రియాల్టీ షోకు వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న కింగ్ నాగర్జున కు అషూ రెడ్డి కిస్ పెట్టి హాట్ గా హౌస్ లోకి ఎంట్రి ఇచ్చింది. అషూ రెడ్డి హాట్ ఎంట్రీతో బిగ్ బాస్ ఓటీటీ అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఎంట్రీలోనే అదరగొట్టిన అషూ రెడ్డి.. హౌస్ లో ఎలా ఉంటుందో అనే ప్రశ్న.. ప్రస్తుతం బిగ్ బాస్ అభిమానుల్లో నెలకొంది.
అలాగే బిగ్ బాస్ – 2 లో కంటెస్టెంట్ గా ఉన్న యూట్యూబర్ మహేశ్ విట్టా బిగ్ బాస్ ఓటీటీలోకి రెండో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఇద్దరు కూడా గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారే కావడం విశేషం.