బీహార్లో ఎన్నికల ఫలితాల సరళి మారుతోంది. రౌండ్లలో ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న ఎన్డీఏ తాజా రౌండ్స్ తో ముందంజలోకి వచ్చేసింది. ఒకరకంగా బీహార్ లో హోరాహోరీగా యుద్ధం సాగుతోంది అని చెప్పవచ్చు రౌండ్స్ పెరిగే కొద్దీ ఎన్డీఏ ఆదిక్యత పెరుగుతూ వెళుతుంది. మహా ఘట్ బంధన్ అలాగే ఎన్ డి ఏ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎల్జెపి కీలకంగా మారనుంది. ఒకరకంగా బీహార్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగుతోంది. దీంతో బీహార్ ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జేడీయూ తమకు ఎదురు గాలి వీచింది అని ఒప్పుకుంది. ప్రస్తుతానికి జెడియు లీడింగ్ లోకి రాగా ఆర్జెడి వెనకబడింది. జేడీయూ ఇప్పుడు 120 సీట్లు ఆధిక్యత కనబరుస్తోంది అయితే ఆర్జెడి మాత్రం 113 సీట్లకు పడిపోయింది.