Breaking : ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశం

-

దేశ రాజధాన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి పదవీ కాలాన్ని పొడిగించే ప్రతిపాదనకు చోటు దక్కుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 350 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే.. 28 రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ‎ఆరుగురు డిప్యూటీ సీఎంలు, 35 మంది కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపుపై ఈ సమావేశాల్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలకు సమాయత్తం అయ్యే అంశంపైనా చర్చించనున్నారు. రాజకీయ, ఆర్ధిక అంశాలపై కార్యవర్గం తీర్మానాలు చేయనుంది. ఈ సమావేశాల్లో భాగంగా సాయంత్రం ఢిల్లీలో కిలోమీటర్ పొడవున రోడ్ షో జరుగనుంది. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొంటారు. రోడ్ షో సందర్భంగా రోడ్డు పొడవునా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఇప్పటికే తెలంగాణ నుంచి బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీ చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version