రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు : ఇంద్రసేనారెడ్డి

-

తెలంగాణలో ఒక్కసారిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక బదులు టీఆర్ఎస్ ముందస్తుకే వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేసినప్పుడు మునుగోడు సెగ్మెంట్లో బీజేపీకి 30 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు ఇంద్రసేనారెడ్డి.

మునుగోడుపై రాజగోపాల్‌రెడ్డికి మంచి పట్టు ఉందన్న ఇంద్రసేనారెడ్డి.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించినా మునుగోడులో ఓడిపోవడానికి కారణం రాజగోపాల్‌రెడ్డేనని అన్నారు. అప్పుడే ఓడిపోయిన టీఆర్ఎస్ ఇప్పుడెలా గెలుస్తుందన్నారు ఇంద్రసేనారెడ్డి. మునుగోడులో విజయం మళ్లీ రాజగోపాల్‌రెడ్డిదేనని జోస్యం చెప్పారు ఇంద్రసేనారెడ్డి. అక్కడ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా మునుగోడులో కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని తేల్చి చెప్పారు ఇంద్రసేనారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version